English | Telugu

ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు నిరాహార దీక్ష

లాక్‌డౌన్ సమయంలో పేద ప్రజలను ఆదుకోవాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు 12 గంటలు నిరాహార దీక్ష చేపట్టారు. నష్టపోయిన ఆక్వా రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ప్రతి కుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే మూసివేసిన అన్నా క్యాంటీన్లు వెంటనే తెరవాలని ఆయన పట్టుబట్టారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న పోలీసులు, వైద్య సిబ్బంది, ఇతర అధికారులకు వెంటనే రక్షణ కిట్లు అందించాలని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు డిమాండ్ చేశారు.