English | Telugu
విజయసాయిరెడ్డి శకుని పాత్ర పోషిస్తున్నారట!
Updated : Apr 22, 2020
విజయసాయి రెడ్డి ప్రమేయం ఉండవచ్చేనేమో అని కొంతమంది బిజెపి, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‍ను భ్రష్టు పట్టించేందుకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమర్ధవంతంగా శకుని పాత్ర పోషిస్తున్నారని ఒక చర్చా కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత ఎం.తులసీరెడ్డ్డి దూషించారు.
మహాభారతంలో శకుని ఒక ముఖ్య పాత్ర. ఇతడు కౌరవుల యొక్క మద్దతుదారు. ఈయన తెలివైన, పదునైన మేధస్సు కలిగిన ఒక స్వార్థపరునిగా చిత్రీకరింపబడ్డాడు. శకుని కౌరవుల మేనమామ.
ధృతరాష్ట్రుడు తన తండ్రిని, సోదరులను హింసించిన సంఘటనల్ని మనసులో పెట్టుకొని శకుని ధృతరాష్ట్రుడు మరియు భీష్ముని పై కక్ష పెంచుకున్నాడు. ఆ వంశాన్ని మొత్తంగా సర్వనాశనం చేస్తానని ప్రతినబూనాడు. మొత్తం కౌరవ వంశాన్ని నాశనం చేసేందుకే కంకణం కట్టుకున్న శకుని, మహాభారత యుద్ధంలో కౌరవులకు సహాయమందిస్తున్నట్లు నటిస్తూ వారి కొంప ముంచాడు. శకుని పైకొక విధంగా… లోపల మరో విధంగా మేనల్లుడైన దుర్యోదనుడు రెచ్చగొట్టాడు. రెచ్చిపోయిన దుర్యోదనుడు అందుకు మూల్యం చెల్లించుకొని వంశ నాశనానికి కారణం అయ్యారనే విషయాన్ని గుర్తు చేస్తూ విజయసాయిరెడ్డిని శకునితో పోల్చారు.
పరిపాలనలో పొరపాట్లు, తప్పులు జరిగితే.. ముఖ్యమంత్రికి వాస్తవాలు చెప్పి ఆ తప్పిదాలను, పొరపాట్లను సరి చేయాల్సిన బాధ్యత ఉన్న విజయసాయిరెడ్డి.. మా ముఖ్యమంత్రి బ్రాహ్మాండంగా పనిచేస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు జేజేలు కొడుతున్నారు అని పరోక్షంగా జగన్ కొంప ముంచుతున్నాడని వ్యాఖ్యానించారు.
తులసి రెడ్డి వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి జగన్ నమ్ముతారా లేక తేలికగా తీసుకుంటారా? ఇదే ఏపీలో రాజకీయాల్లో ఇప్పడు హాట్ టాపిక్.