English | Telugu

అధికారులను మందలించిన హైకోర్ట్.......


ఆర్టీసీ సమ్మె పై చర్చ రోజుకో కీలక మలుపు తిరిగుతోంది.ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ విధించిన డెడ్ లైన్ ముగియడం, డెడ్ లైన్ లోపు ఎక్కువ సంఖ్యలో కార్మికులు విధులకు హాజరు కాకపోవడం తమ డిమాండ్ల సాధనకు జేఏసీ పట్టుబడుతుండటంతో హై కోర్టు విచారణలో పలు విషయాలు పై చర్చించేందుకు సిద్ధమైయ్యారు. విచారణలో ఉద్దేశ పూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందని ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా అధికారులను హెచ్చరించింది హైకోర్ట్.

ఆర్ధిక శాఖ సమర్పించిన రెండు నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఐఏఎస్ అధికారులు అసమగ్ర నివేదికలు ఇవ్వడంపై ధర్మాసనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి, ఎండి సునీల్ శర్మ, ఆర్థికశాఖ అధికారులు స్వయంగా హాజరయ్యారు. రికార్డు పరిశీలించాకే నివేదిక ఇస్తున్నట్టుగా కోర్టుకు తెలిపింది ఆర్థికశాఖ.

అయితే మొదటి నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా అని హై కోర్టు ప్రశ్నించింది. దీనిపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు స్వయంగా వివరణ ఇచ్చారు. సమయాభావం వల్ల రికార్డుల ఆధారంగా నివేదిక రూపొందించామని ఆయన వెల్లడించారు. మన్నించాలని హైకోర్టుని వేడుకున్నారు. అయితే క్షమాపణ కోరడం సమాధానం కాదని వాస్తవాలు చెప్పాలని ఆదేశించింది హైకోర్ట్.