English | Telugu
ఆర్టీసీ విలీనం పై కేసీఆర్ ఎందుకు వ్యతిరేకత చూపిస్తున్నారు?
Updated : Oct 25, 2019
తెలంగాణలో 21 రోజులుగా దుమారం రేపుతున్న అంశం ఏదైనా ఉంది అంటే ఆర్టీసీ సమ్మెనే .ప్రభుత్వం తగ్గట్లేదు కార్మిక సంఘాలు వెనుకడుగు వేయడం లేదు దీంతో ఆర్టీసీపై ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అందరిలోను నెలకొంది. ఇవాళ ఆర్టీసీ జేఏసీ సమావేశం జరగనుంది భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నాయి కార్మిక సంఘాలు. సీఎం వ్యాఖ్యల తరువాత కార్మికులు అయోమయంలో పడ్డారు. దీంతో తమ పోరును ఎలా కొనసాగించాలా అన్న దానిపై సమావేశంలో చర్చించనున్నారు జేఏసీ నేతలు. ఇటు సమ్మె ఇరవై ఒకటివ రోజుకు చేరుకుంది ప్రభుత్వం కావాలనే చర్చలకు పిలవడం లేదని జేఏసీ నేతలు అంటున్నారు. ఆర్టీసీ విలీనం సహా ఇరవై ఆరు ప్రతిపాదనల్ని తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది యూనియన్లే ఆర్టీసీని ముంచే సైన్ స్పష్టం చేశారు. ప్రజలకు రవాణా సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని రాష్ట్రాల్లో ఆర్టీసీల గుత్తాధిపత్యం పోవాలిని కేంద్రం చట్టం తెచ్చింది అన్నారు.సెప్టెంబరు ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం ఎన్ని ప్రైవేటు బస్సుల కైనా అనుమతిచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. కొద్ది రోజుల్లో రవాణా మంత్రితో కూర్చుని ప్రైవేటు బస్సు లకు పర్మిట్ లు ఇవ్వనున్నట్టు చెప్పారు. కేసీఆర్ ఆర్టీసీ యూనియన్ ల పై చేసిన వ్యాఖ్యలు చాలా వ్యతిరేకంగా అవమానపరిచేలా ఉన్నాయి. సీఎం వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను తీసేసి అధికారం ఎవరికీ లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ ఎవరి జాగీరు కాదని సీఎం కేసీఆర్ మాటలకు కార్మికులు ఎవరూ భయపడొద్దని సూచించారు. ఆర్టీసీ ఎవరి సొత్తు కాదని, ఎన్నొ ఏళ్ల చరిత్ర ఉన్న ఆర్టీసీ సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటుంది అని ఆయన వెల్లడించారు.