English | Telugu

ఫిలిప్పైన్స్ లో మెడిసిన్ విద్యార్థి మృతి

కడప జిల్లా సిద్ధవటం మండలం ఉప్పర పల్లి కి చెందిన మేరువ శ్రీహరి ఫిలిప్పైన్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మెరువ ప్రసాద్, వెంకట సుబ్బమ్మ ల కుమారుడు శ్రీహరి మెడిసిన్ మొదటి సంవత్సరం చదువు తున్నాడు.

శ్రీ హరి తో పాటు విద్యాభ్యాసం చేస్తున్న స్నేహితుడు ఈ దుర్వార్త ను ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు చేర వేసాడు.

ఫిలిప్పైన్స్ నుంచి త్వరగా మృతదేహం రప్పించేందుకు తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.