English | Telugu
ఇప్పటి వరకు కరోనా మృతులు 3,122
Updated : Mar 3, 2020
ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ బారినపడి ఇప్పటి వరకు 3,122 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ బారినపడినవారి సంఖ్య 90,823 కి చేరింది. ఒక్క చైనాలోనే 2,943 మంది మృతి చెందారు. ఈ వైరస్ నుంచి కోలుకున్న 47,204 మందిని వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈయూ దేశాల్లో 38 మంది మృతి చెందగా, ఇరాన్‌లో మృతుల సంఖ్య 66కి, ఇటలీలో మృతుల సంఖ్య 52కి చేరింది. దక్షిణ కొరియాలో ఒక్క రోజులోనే 500 కొత్త కేసులు బయటపడ్డాయి. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు అన్ని దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి.