English | Telugu

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ..

తెలంగాణ ప్రభుత్వం నూతన మద్యం షాపులకు నోటిఫికేషన్ జారి చేసింది. ఈ నోటిఫికేషన్ 1 నవంబర్ 2019 నుంచి 31 అక్టోబర్ 2021 వరకు ఈ నూతన మద్యం పాలసీ అమలలో ఉండనుంది. రాష్ట్రం లో అనేక చోట్ల ఇప్పటికే ఉన్న మద్యం షాపుల రెన్యూవల్ కోసం అలానే మరికొన్ని కొత్త మద్యం షాపుల కోసం దరఖాస్తు కోసం ఫీజును కూడా నియమించారు. మద్యం షాపుల దరఖాస్తు ఫీజు రెండు లక్షల రూపాయలుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు శ్లాబుల కింద రెండు వేల రెండు వందల పదహారు వైన్ షాపులను ఏర్పాటు చేయనున్నారు. ఎంత జనాభా ఉన్న చోట ఎంత లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉండాలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు వేల వరకు జనాభా ఉన్న చోట యాభై లక్షల రూపాయలు, యాభై వేల వరకు జనాభా ఉన్న చోట యాభై ఐదు లక్షల రూపాయలు, లక్ష వరకు జనాభా ఉన్న చోట అరవై ఐదు లక్షలు, ఇరవై లక్షల జనాభా ఉన్న చోట ఎనభై ఐదు లక్షల రూపాయలను ఫీజుగా నిర్ణయించారు. ఇరవై లక్షల జనాభా పైన ఉంటే లైసెన్స్ ఫీజు ఏడాదికి కోటి పది లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.