English | Telugu

మెరుగైన సేవలకై పలు శాఖలకు సబ్ కమిటీలు

రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఆరోగ్యం శానిటేషన్ తో సహా పలు అంశాల పై సూచనలకు ఎనిమిది క్యాబినెట్ సబ్ కమిటీలను నియమించింది. అటు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వారి సమస్యల పై కూడా పరిశీలన కొరకు సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కమిటీ వేసింది. ఇవాళ కార్మిక సంఘాల నాయకులతో భేటీ కానున్న అధికారులు వీలైనంత త్వరగా రిపోర్టు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. సుదీర్ఘంగా ఏడున్నర గంటల పాటు జరిగిన ఈ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాల పై చర్చ జరిగింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వారి సమస్యల పరిష్కారం కోసం సీనియర్ ఐఏఎస్ ఆధ్వర్యంలో కమిటీని వేసింది. ప్రభుత్వం వీలైనంత త్వరగా కమిటీ రిపోర్టు ఇవ్వాలని సూచించింది. రిపోర్టు ఆధారంగా ఆర్టీసీ పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పింది. పండుగ సమయంలో సమ్మె వద్దని కార్మికులకు సూచించింది.

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సర్కార్ ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేసేందుకు ప్రధాన శాఖల పనితీరుపై ఎనిమిది క్యాబినెట్ సబ్ కమిటీలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు పౌల్ట్రీ పై పాలసీలు రూపొందించాలని తీర్మానించారు. మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, తలసాని సభ్యులుగా వైద్య, ఆరోగ్య కమిటీని వ్యవహరించగా, మంత్రి ఎర్రబెల్లి నేతృత్వంలో ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ సభ్యులుగా గ్రామీణ పారిశుధ్య కమిటీని వ్యవహరిస్తుండగా, మంత్రి కేటీఆర్ అధ్యక్షతన హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, తలసాని, సబితా ఇంద్రా రెడ్డి సభ్యులుగా పట్టణ పారిశుధ్య కమిటీ పనులు నియమించారు. మత్రి హరీశ్ నేతృత్వంలో కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ సభ్యులుగా వనరుల సమీకరణ కమిటీని వ్యవహరించగా, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో కేటీఆర్, జగదీశ్ రెడ్డి, తలసాని, ప్రశాంత్ రెడ్డి సభ్యులుగా పచ్చదనం కమిటీని వ్యవహరించగా, మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి సభ్యులుగా వ్యవసాయ కమిటీని వ్యవహరించగా, మంత్రి తలసాని శ్రీనివాస్ గౌడ్, అధ్యక్షతన ఈటెల, నిరంజన్ రెడ్డి సభ్యులుగా పౌల్ట్రీ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితి పై క్యాబినెట్ విస్తృతంగా చర్చించింది. వర్షాకాలంలో పండిన అన్ని రకాల పంటలను ప్రభుత్వ పరంగా కొనుగోలు చెయ్యడానికి పౌరసరఫరాల సంస్థతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు సిద్ధం కావాలని ఆదేశించింది. రబీకి కావలసిన విత్తనాలు, ఎరువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించింది. మరోవైపు గ్రామాల్లో అమలవుతున్న ముప్పై రోజుల గ్రామ ప్రణాళిక అమలుపై చర్చించేందుకు ఈ నెల పది న మంత్రులు కలెక్టర్లతో భేటీ కావాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశానికి డీపీవోలను, డీఎల్ పీఓలను కూడా ఆహ్వానించనున్నారు అని సమాచారం.