English | Telugu
గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసేందుకు సిధ్ధమైన ఏపీ సర్కార్...
Updated : Oct 2, 2019
మహాత్ముడు జన్మదినం రోజు గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. గ్రామ సచివాలయాల వ్యవస్థను శ్రీకాకుళం జిల్లా కరపలో జగన్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా లోనే ఎనిమిది వందల ముప్పై ఐదు సచివాలయాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో సచివాలయంలో పది టేబుళ్లు, ముప్పై కుర్చీలూ, ఆరు ఫైల్ రాక్స్, ఒక గ్రామ సచివాలయం బోర్డ్, ఒక ఇనుప బీరువా ఉంటాయి.
ఇవన్నీ టెండర్ల ప్రకారం కొనుగోలు చేయాల్సింది. నవంబర్ నెలాఖరు కల్లా అన్ని సచివాలయాల్లో సౌకర్యాల ఏర్పాటు చేయాలన్నది సర్కారు లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు అందాలన్న లక్ష్యంతో గ్రామ సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ముందుగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను అమలు చేస్తోంది, వాళ్ళ ద్వారానే ఇంటింటికీ పథకాలు అందేలా ప్రభుత్వం చేయబోతోంది.
కరపలో పైలాన్ ను సీఎం జగన్ ఆవిష్కరించారు, గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు అనంతరం అన్ని సచివాలయాలకు నవంబరు నెలాఖరు కల్లా పూర్తిగా అమలయ్యేలా చూస్తామన్నారు. గ్రామాల్లో అభివృద్ధికి ఊతమిచ్చేలా సచివాలయం ఏర్పాట్లు ఉంటుందన్నారు. అన్ని సచివాలయాలకు నవంబర్ నెలాఖరు కల్లా పూర్తి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా కరప గడపలో కొత్తదనం వుంటుందనీ గ్రామ సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్ అన్నారు.