English | Telugu

టీ కాంగ్రెస్‌లో ప్ర‌కంప‌న‌లు.. రేవంత్ వ్య‌వ‌హారం తేల్చాల్సిందేన‌ని హైక‌మాండ్‌పై ఒత్తిడి

తనకు పీసీసీ పీఠం ఖాయమని పార్టీలో బిల్డప్‌ ఇచ్చుకున్న రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ హైకమాండ్‌ షాక్‌ ఇవ్వబోతోంద‌ట‌. భూ కబ్జా వ్యవహారాలన్నింటినీ దాచిపెట్టి సొంత ఎజెండాతో ప‌ని చేస్తున్న రేవంత్ పై స్వంత పార్టీలోనే సీనిర‌య‌ర్లంతా ముక్కుమ్మ‌డిగా దాడి చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది అనే విషయంపై సీనియర్‌ నేతలు ఎప్పటికప్పుడు అధిష్టానానికి సమాచారం చేరవేస్తున్నారు. వి. హన్మంతరావు, జగ్గారెడ్డిలాంటి నేతలు రేవంత్‌ తీరును తప్పుబడుతున్నారు. తనమీద వచ్చిన నిందలను చెరిపేసుకోకుండా ఇతరులపై బురద జల్లడం ఎంతవరకు కరెక్ట్‌ అని వారు కడిగిపారేస్తున్నారు.

సొంత ఎజెండాతో ముందుకెళ్తున్న రేవంత్‌కు ఆజాద్‌ ఎలా మద్దతిస్తారని హన్మంతరావు ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి పార్టీ పరువు తీస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అవుతున్నారు. సమస్యలపై ఎవరైనా పద్దతి ప్రకారం పోరాడాలని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ఒక్కడే తీస్‌మార్ ఖాన్ కాదని, ఆయన తీరుపై సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. నింద అయితే నిరూపించుకో.. తప్పయితే సరిదిద్దుకో అని పదేపదే చెబుతున్నా.. పట్టించుకోని రేవంత్‌ సీన్‌ని ఇప్పుడు పార్టీ పెద్దలే ర‌చ్చ చేస్తున్నారు. రేవంత్ వ్యవహారంపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పార్టీలో విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తంమీద - రేవంత్‌ పాపాల పుట్ట పగిలిందని, భూకబ్జాల వ్యవహారం… ఆయన రాజకీయ భవిష్యత్‌ను అంధకారం చేసిందన్న అభిప్రాయం కాంగ్రెస్‌ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

టీడీపీలో ఉన్నప్పుడూ సేనియర్లందరిని సైడ్ చేసేసిన రేవంత్.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కూడా అదే వ్యవహారశైలిని కొనసాగించారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారానికి తెరలేపిన ఆయన ఆ కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుపాలయ్యారు. దీనితో తెలంగాణలో టీడీపీ ఖతం అయిపొయింది. ఇక పార్టీ పరిస్థితి దిగజారాక.. తట్టాబుట్టా సర్దుకుని కాంగ్రెస్‌లోకి జంప్ అయిపోయి.. టీడీపీని నిండా ముంచేశారు.

ఇప్పుడే ఇదే పరిస్థితిని కాంగ్రెస్ పార్టీకి కూడా పట్టించేలా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు జరుపుతున్నారు. పీసీసీ పదవిపై ఎప్పటినుంచో కన్నేసిన రేవంత్.. ఇప్పటికే ఢిల్లీలో మేనేజ్ చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని పొందారు. ఇక నెక్స్ట్ టార్గెట్ పీసీసీ పోస్ట్.. దీని కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిన సమయంలోనే గోపన్‌పల్లి భూదందాలో అడ్డంగా దొరికిపోయారు. దీంతో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు పండ‌గ చేసుకుంటూ టీవీ టిబేట్‌ల‌లో వేడిపుట్టిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌ హోదాలో ఉండి పర్సనల్‌ అజెండానే వర్క్‌గా మార్చుకున్నారంటూ సీనియర్లు ఈసడించుకుంటున్నారు. అస‌లే తెలంగాణలో కాంగ్రెస్ కష్టాల్లో ఉంది. ఎన్నికలు ఏవైనా గెలుపు పాచిక.. ఒక్కటీ పారడంలేదు. ఈ పరిస్థితుల్లో పార్టీని ధీటుగా ముందుకెలా తీసుకెళ్లాడానికి కొత్త వ్యూహాలు అమలు చేయాలి. కానీ, అందుకు భిన్నంగా తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సీనియర్లు అంటున్నారు.

పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అంటే.. విభిన్నరకాల ఆలోచనలు, వాటిని వ్యక్తం చేసే పార్టీ పరమైన స్వేచ్ఛ అంటుంది. కానీ.. సొంత అజెండాను పార్టీ జెండాకు అంటించి, అదే సిద్ధాంతం, అదే నినాదం అని రెచ్చిపోతే.. అసలుకే ఎసరొస్తుందన్నది సీనియర్ల మాట. రేవంత్‌ తీరుతో పార్టీకి కోలుకోలేని నష్టమన్న రియలైజేషన్‌లోకి కాంగ్రెస్ సీనియర్లు వచ్చినట్లు తెలుస్తోంది.