English | Telugu
కన్నా గారూ.. ఏంటి సార్.. ఈ ట్విట్టర్ పోస్టులు?
Updated : Mar 13, 2020
భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ.. కానీ ఆ పార్టీ అధికార ట్విట్టర్ ఎకౌంట్ లో చేస్తున్న చవకబారు వ్యంగ్య వ్యాఖ్యానాలు మాత్రం ఆ పార్టీ పరువుని పడేస్తున్నాయి. కరోనా సమయం లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటె, ఆయన ఏ రకం గా హడావుడి చేస్తారు అనే దాని మీద చేసిన ఒక ట్విట్టర్ పోస్ట్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ బీ జె పీ ని ఇరుకున పడేసింది. " ఒక బాధ్యతాయుతమైన పార్టీ తరపున ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక ట్వీట్ చేసేటప్పుడు కనీస సంస్కారం ఉండాలనే స్పృహ కూడా లేకుండా, వైసీపీ కంటే సంస్కారహీనమైన దిగజారుడు స్టేట్మెంట్లు ట్వీట్లు చేస్తుంటే మిమ్మల్ని (బీజేపీని) మెమెందుకు గౌరవించాలి? అంటూ ప్రస్తుతం బీ జె పీ మీద నెటిజెన్లు దాడుల వర్షం కురిపిస్తున్నారు," అంటూ నెటిజెన్లు విమర్శిస్తున్నారు.
ఒక జాతీయపార్టీ పేరుతో ఇటువంటి చిల్లర లేకి పనులు చిల్లర వేషాలు దిగజారుడు ట్వీట్లు చేస్తున్నారు కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్లో కనీస గుర్తింపు గౌరవం మర్యాదలేకుండా అనాధలకంటే హీనంగా దయనీయంగా తయారయ్యింది బీజేపీ పరిస్థితి.! " అసలు ఆయన ఉండి ఉంటె, కరోనా పై కత్తి యుద్ధం చేసి, దాన్ని ముందే తరిమి కొట్టే వాడు ... కరోనా వైరస్ మందును యిట్టె కనిపెట్టేసి ప్రపంచాన్ని కాపాడే వాడు ..అసలు ఆ రివ్యూ మీట్లు..ఆభజనలు.. ఆ డాక్టర్లను మందలిస్తున్నట్టు వీకెండ్ కథనాలు... అబ్బబ్బబ్బా ....", అంటూ ఆంధ్ర ప్రదేశ్ బీ జె పి చేసిన పోస్టు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. రాజకీయ పార్టీలు విధాన పరమైన నిర్ణయాలపైనో, రోజూ వారీ సంఘటనలు, అంశాలపైనా సోషల్ మీడియా పోస్టింగులు పెట్టుకుంటే, పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ, అదే పనిగా ప్రముఖ వ్యక్తులను టార్గెట్ చేస్తూ.. పెట్టె పోస్టులు మాత్రం కచ్చితం గా ఇబ్బంది పెట్టె అంశాలే. దీనిపై ఆంధ్ర ప్రదేశ్ బీ జె పి ఏ రకంగా స్పందిస్తుంది వేచి చూడాలి మరి.