English | Telugu

ఏపీలో టీడీపీకి మరో షాక్..

జగన్ సమక్షంలో నేడు వైసీపీలో చేరనున్న ఎమ్మెల్సీ శమంతకమణి, యామినీబాల!
సింగనమల నియోజకవర్గంలో టీడీపీకి మరో ఝలక్
నేడు సీఎం జగన్ సమక్షంలో పార్టీ తీర్థం
అనుచరులతో కలిసి విజయవాడకు మహిళా నేతలు
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మరో షాక్ తగలింది. ఆ పార్టీని వీడిపోతున్న నేతల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీబాల కూడా చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో నేడు వీరిద్దరూ వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. సింగనమల నియోజకవర్గంలో గట్టి పట్టున్న వీరిద్దరూ పార్టీ అనుచరులతో కలిసి విజయవాడ బయలుదేరినట్టు సమాచారం.