English | Telugu
తెలుగు రాష్ట్రాలకు రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు
Updated : Mar 20, 2020
తెలుగు రాష్ట్రాలకు రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులుంటాయి: స్వామి స్వరూపానందేంద్ర
కరోనా కారణం గా విశాఖ శ్రీ శారదాపీఠం ఆలయాల మూసివేత
విశాఖ శారదాపీఠ పాలిత ఆలయాలు, ఆశ్రమాలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు విశాఖ శ్రీ శారదాపీఠం ప్రకటించింది. సర్వదర్శనాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి ప్రకటించారు.
అయితే, నిత్య కైంకర్యాలు యదావిధిగా కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. కైంకర్యాల అనంతరం మన్యుసూక్త, అమృత పాశుపత హోమాలు, ధన్వంతరి జపం, అరుణ పారాయణ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ, ఆంధ్ర, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల్లో విశాఖ శారదాపీఠ పాలిత ఆలయాలు, ఆశ్రమాలు కూడా మూసివేస్తున్నట్టు చెప్పారు.
ఇదిలా ఉండగా, కరోనా వైరస్ నిర్మూలనకు నియంత్రణ చర్యలు పాటించడం ఒక్కటే కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి తరుణోపాయం
అని, ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడ వద్దని,
సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్వామి స్వరూపానందేంద్ర సూచించారు. రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు తెలుగు రాష్ట్రాలకు పరిపూర్ణంగా ఉంటాయని స్వామి స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.