English | Telugu
సీఎం జగన్ మాటలు ఇబ్బందిగా మారాయా...
Updated : Mar 20, 2020
వైసీపీతో పాటు ప్రభుత్వంలో మంత్రులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..కరోనా పై సీఎ: చాలా సింపుల్ గా మాట్లాడినపుడు మేము ప్రత్యేకంగా కరోనాపై మాట్లాడడానికి ఏముంటుంది అనే అభిప్రాయాన్ని కొంత మంది మంత్రులు వ్యక్తం చేస్తున్నారు...లోపల ఎన్ని రివ్యూలు చేసినా పైకి మాత్రం సీఎం చేసిన కామెంట్లే బలంగా పోతున్నాయి..పక్క రాష్ట్రాన్ని పోల్చి చూసి మరీ ఏపీ సీఎం పై విమర్శలు చేస్తున్నారు...ఏపీలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సీఎం కామెంట్లతో ఏమీ జరగడం లేదనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది..టిడిపి దీన్ని మరింత క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉంది..
ఏది ఏమైనా ఆరోజు ప్రెస్ మీట్లో సీఎం ఏం కామెంట్ చేసినా తిరిగి సరిదిద్దుకునే పరిస్థితి ఉంది అంటున్నారు కొంత మంది...కరోనా విషయంలో అప్పటికి ఇప్పటికీ పరిస్థితి తేడా ఉందని సీఎం మరోసారి చెబితే సరిపోతుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి...