English | Telugu
రంగు పడింది.. సుప్రీంకోర్టులోనూ జగన్ సర్కార్ కి చుక్కెదురైంది
Updated : Jun 3, 2020
జగన్ సర్కార్ కి కోర్టుల్లో షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్యాలయాలకు పార్టీ జెండా రంగులపై సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించాలని జగన్ సర్కార్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని న్యాయస్థానం హెచ్చరించింది.