English | Telugu
ప్రముఖ నిర్మాత ఇంట్లో విషాదం
Updated : Jul 15, 2025
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni)హీరోగా వచ్చిన 'ది వారియర్', 'స్కంద' వంటి చిత్రాలతో పాటు నాగార్జున(Nagarjuna),నాగ చైతన్య(Naga Chaitanya) లతో 'నా సామి రంగ', 'కస్టడీ' వంటి పలు విభిన్న చిత్రాలని నిర్మించిన నిర్మాణ సంస్థ 'శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్'. ఈ సంస్థ అధిపతి పేరు 'చిట్టూరి శ్రీనివాసా'(Srinivasaa Chitturi).
ఈ రోజు ఉదయం శ్రీనివాసా సోదరుడు 'చిట్టూరి కాశీవిశ్వనాథ్'(Chitturi Kashi Vishwanath)ఉమ్మడి గోదావరి జిల్లాలోని ఆయన స్వగ్రామం పసివేదులలో చనిపోవడం జరిగింది. కాశీ విశ్వనాధ్ గత కొంత కాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన వయసు ప్రస్తుతం 49 సంవత్సరాలు. దీంతో పలువురు చిత్ర ప్రముఖులు చిట్టూరి శ్రీనివాసాకి తమ సానుభూతిని తెలియచేస్తున్నారు.
చిట్టూరి శ్రీనివాసా 2018 లో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'యూటర్న్'తో సినీ రంగ ప్రవేశం చేసాడు. గోపీచంద్, తమన్నా, సంపత్ నంది కాంబోలో వచ్చిన 'సిటీ మార్' అనే చిత్రాన్ని కూడా నిర్మించడం జరిగింది.