English | Telugu
నాగార్జునతో అంత ఈజీ కాదు.. ప్రముఖ దర్శకుడి కామెంట్స్ వైరల్
Updated : Jul 15, 2025
తన స్టార్ డమ్ కి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా, ఏ క్యారక్టర్ లోకైనా అవలీలగా ప్రవేశించి, ఆయా క్యారెక్టర్స్ కి స్టార్ డమ్ ని తెచ్చే హీరో 'నాగార్జున'(Nagarjuna). ఆయన నుంచి ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలే అందుకు ఉదాహరణ. సిల్వర్ స్క్రీన్ పై 'నాగ్' టచ్ చెయ్యని జోనర్ లేదు. రీసెంట్ గా కుబేరతో సత్తా చాటిన నాగ్, అగస్ట్ 14 న 'కూలీ'(Coolie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో 'సైమన్' అనే నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ లో కనిపిస్తుండటంతో, నాగ్ క్యారక్టర్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.
రీసెంట్ గా 'కూలీ' దర్శకుడు 'లోకేష్ కనగరాజ్'(lokesh Kanagaraj)ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'కూలీలో నాగ్ సర్ క్యారక్టర్ చాలా కొత్తగా ఉండబోతుంది. క్యారక్టర్ కి సంబంధించిన ఐడియాని మొదట నాగ్ సర్ కి చెప్పాను. ఆయనకెంతో నచ్చింది. కానీ సర్ ని ఒప్పించడం అంత తేలిక కాదు. చాలా కష్టంతో ఒప్పించాను. సుమారు ఏడెనిమిది సార్లు వరకు నారేషన్ ఇచ్చాను. సదరు క్యారక్టర్ ని తీర్చిదిద్దటం కూడా సవాలుగా మారిందని లోకేష్ చెప్పుకొచ్చాడు. లోకేష్ చెప్పిన ఈ మాటలతో నాగార్జున కథల విషయంలో, తన క్యారక్టర్ కి సంబంధించిన విషయంలో ఎంత సిన్సియర్ గా ఉంటారో అర్ధమవుతుంది.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'కూలీ'లో రజనీకాంత్(Rajinikanth),నాగార్జున స్క్రీన్ షేర్ చేసుకోనుండటంతో, పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న ఇద్దరి అభిమానులు 'కూలీ' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శృతి హాసన్(Shruthi haasan)హీరోయిన్ గా చేస్తుండగా మరో హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde)ఒక స్పెషల్ సాంగ్ లో చేస్తుంది. 'మోనికా' అంటూ ఇటీవల రిలీజైన ఆ సాంగ్, సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది. అగ్ర హీరో 'అమీర్ ఖాన్'(Amir Khan)గెస్ట్ రోల్ లో కనిపిస్తున్న 'కూలీ' ని సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్(kalanithi Maaran)భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. అనిరుద్ సంగీతాన్ని అందించడం జరిగింది.