English | Telugu
అండర్ వరల్డ్ డాన్ కి గన్ శాల్యూట్.. ఆరుగురు అరెస్ట్!
Updated : May 16, 2020
కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ముత్తప్ప రాయ్ నిన్న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని అనుచరులు బిడదిలోని ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి, అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయన భౌతికకాయానికి గన్ శాల్యూట్ చేశారు. ఆయుధాల చట్టం కింద ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, కాల్పులు జరిపేందుకు ఉపయోగించిన తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.