English | Telugu
చైనీయులే ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టారా?
Updated : Mar 15, 2020
ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా (కోవిడ్ 19) వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మండిపడ్డారు. ఏది పడితే అది తిని ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గబ్బిలాలు, కుక్కలు, పాములు, పిల్లులు, ఎలుకల్ని తినడం, అంతే కాదు వాటి రక్తాన్ని, మూత్రాన్ని తాగి తద్వారా ప్రపంచానికి వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గబ్బిలాలు, కప్పలు, పాములు, కుక్కలు వంటికి తినడం తమ సంస్కృతిలో భాగం అని చైనీయులు అనొచ్చు. కానీ.. ఆ సంస్కృతి మీకు లాభాన్ని కాకుండా తీవ్రమైన నష్టాన్నే మిగిల్చింది కదా. ఏది పడితే అది తినడం సరికాదని అంటున్నా. నేను చైనీయులకు వ్యతిరేకం కాదు. అక్కడ మూగజీవాలపై ఉన్న చట్టాలనే ప్రశ్నిస్తున్నా' అని అక్తర్ పేరొన్నారు.
'రక్తం, వ్యర్థాలను సైతం ఆహారంగా తీసుకునే చైనీయులపై చాలా కోపంగా ఉంది. ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడింది. తద్వారా పర్యాటకం రంగం దెబ్బతిన్నది. ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లుతోంది, అన్నిదేశాలు పతనం అవుతున్నాయి' అని అక్తర్ అన్నారు.
ప్రాణాంతక కరోనా వైరస్ 145కు పైగా దేశాలకు పాకింది. 1,45, 810 మంది ఈ వైరస్ బారినపడి చికిత్స పొందుతుండగా.. 5 వేలకు పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక భారత్‌లో 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు మరణించారు.