English | Telugu
పొతిరెడ్డిపాడు నిప్పు ఆరకముందే ఏపీ-తెలంగాణాల మధ్య ఇసుక తూఫాన్!
Updated : May 16, 2020
కర్నూలు జిల్లా గుండ్రేవుల వద్ద తుంగభద్ర నదిలో ఇసుకను తవ్వేందుకు వెళ్లిన ఏపీ వాహనాలను తెలంగాణ అధికారులు సీజ్ చేశారు. ఈ అంశం ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ అధికారుల తీరుపై ఏపీ అధికారులు అసహనం వ్యక్తం చేశారు. అంతర్ రాష్ట్ర ఇసుక సరిహద్దులను గుర్తించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు గతంలో సర్వే చేశారు.
ఏపీ సరిహద్దుల్లోనే ఇసుక తవ్వకాలు జరిగాయని కర్నూలు జిల్లా మైనింగ్ అధికారులు అంటున్నారు. కాదు, కాదు తమ సరిహద్దులో తవ్వకాలు జరిపారని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో. ఈ వివాదపై స్పష్టత రావాల్సిఉంది.