English | Telugu
ఆర్టీసీ బస్సు ప్రమాదంలో బలైపోయిన ఆర్టీసీ కండక్టర్ దంపతులు...
Updated : Oct 31, 2019
హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందారు. ఆర్టీసీ బస్సు, బైక్ ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొహెడ గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ రమణ దంపతులు బైక్ పై వెళ్తుండగా బస్సు ఢీకొట్టింది. వీరిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఆర్టీసీ కండక్టర్ దంపతుల మృతి పై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి ఆర్టీసీ కార్మికులు భారీ ఎత్తున చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్థుతం అక్కడ ఇంకా ఆందోళన ఆందోళన కొనసాగుతూనే ఉంది. విజయవాడ జాతీయ రహదారి పై సుమారు కిలో మీటరుకు మేర కూడా ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. మరొక వైపు వాహనాలని మరొక రూట్ లో పంపించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.
డెడ్ బాడీలు ఇంకా ఆ సంగటనా స్థలంలోనే ఉన్నాయి. ఆర్టీసీ కార్మికులతో పాటు కోహెడ గ్రామానికి చెందిన స్థానికులు కూడా ఆ గటనా స్థలానికి వచ్చారు. చనిపోయింది ఆర్టీసీ కండెక్టర్ కాబట్టి అతని కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా వాళ్ళు ఒక వైపు డిమాండ్ చేస్తున్నారు.మరొక వైపు పోలీసులు వాళ్లతోటి మాట్లాడి సామరస్యంగా డెడ్ బాడీలను తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికి ఒక్కసారిగా గ్రామస్థులతో పాటు ఇటు ఆర్టీసీ కార్మికులు రావడంతో ఆందోళన ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వాళ్లని ఇక్కడి నుండి బెదిరించి పంపించే ప్రయత్నం చేశారు. కానీ స్థానికులు కానీ ఇటు ఆర్టీసీ కార్మికులు కానీ ఒప్పుకునే పరిస్థితి కనపడలేదు. దీనితోటి ప్రస్థుతం బందోబస్థులను పిలిపించే పనిలో ఉన్నారు.మరొకవైపు ఒక ఆటోను పిలిపించి దానిలో పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఆర్టీసీ కార్మికులు అడ్డుకోవడంతోటి తిరిగి పోలిసులు వెనదిరిగారు. పోలీసులు అంబులెన్స్ ను పిలిపించి సమస్యను సామరస్యంగా తేలేలా ప్రయత్నించగా ఘటనా స్థాలానికి వచ్చిన అధికారులు పై ఆర్టీసీ కార్మికులు రమణ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ తీవ్ర నినాదాలు చేస్తున్నారు.