English | Telugu

ఏ పీ లో తోపుడు బండ్ల ద్వారా ఇళ్ల వద్దకే నిత్యావసరాలు : పీ వీ రమేష్

పారాసిట్ మాల్-650 ఎంజీ వేసుకోవచ్చు కానీ, యా స్ప్రిన్ వేసుకోవద్దని ముఖ్యమంత్రి అదనపు చీఫ్ సెక్రెటరీ డాక్టర్ పీ వీ రమేష్ సూచించారు. కరోనాతో ఆందోళన వద్దని, కానీ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు. వైద్య సేవలు అందించేందుకు రిటైరైన డాక్టర్లు.. నర్సుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. " గ్రామాల్లో స్వీయ నియంత్రణ ఎక్కువగా ఉంది. నిత్యావసర వస్తువుల దుకాణాలను రోజంతా తెరిచే ఉంచే ఆలోచన కూడాఉందని ఆయన అన్నారు.
తోపుడు బళ్ల ద్వారా ఇళ్ల వద్దకే నిత్యావసరాలని తెచ్చే ఆలోచన కూడా చేస్తున్నామన్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తోన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటామన్నారు. నిత్యావసర వస్తువుల రవాణ విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, డాక్టర్ల సూచనలు లేకుండా హైడ్రో క్లోరోక్విన్ మెడిసిన్ వాడవద్దని , డాక్టర్ల సూచనలు లేకుండా అమెరికాలో హైడ్రో క్లోరోక్విన్ వినియోగించి భార్యా భర్తలు చనిపోయిన సంఘటనలు ఉన్నాయని కూడా డాక్టర్ పీ వీ రమేష్ గుర్తు చేశారు.