English | Telugu
కేటీఆర్‌కు బావమరిది సంస్థతో ఒప్పందమా! రేవంత్ రెడ్డి
Updated : May 1, 2020
‘‘ఈ పాలసీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ద్వారా జాయింట్ వెంచర్స్ చేసి ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ పాకాల సంస్థ అయిన లక్సాయ్ లైఫ్ సైన్సెస్ సంస్థతో మాత్రల తయారీకి ఒప్పందం చేసుకున్నారు.
‘‘తెలంగాణలో లక్సాయ్ లైఫ్ సైన్స్ అనే సంస్థ ఉంది. దీని డైరెక్టర్ పాకాల రాజేంద్ర ప్రసాద్. ఈయన మంత్రి కేటీఆర్‌కు బావ మరిది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లక్సాయ్ లైఫ్ సైన్సెస్‌తో చేసుకున్న ఒప్పందం ఏమాత్రం సరైంది కాదు. ఎందుకంటే లక్సాయ్ లైఫ్ సైన్సెస్ అనేది ఓ గల్లీ సంస్థ. దాన్ని విలువ కేవలం రూ.14 కోట్లు అయితే, పాకాల డైరెక్టర్‌గా వచ్చాక రూ.150 కోట్లు పెట్టుబడులు వచ్చాయి.’’
‘‘ప్రపంచ వ్యాప్తంగా మందులు ఎగుమతి చేస్తున్న దిగ్గజ సంస్థలు తెలంగాణలో ఉండగా.. ఈ గల్లీ సంస్థతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే ఏప్రిల్ 25 నాడు ఈ ఒప్పందం జరిగింది. ప్రపంచంలో అమెరికా సహా దాదాపు 50 దేశాలకు ఎగుమతులు చేయాల్సిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులను దిగ్గజ సంస్థలను కాదని ఆ సంస్థకు ఎలా ఇస్తారు? లక్సాయ్ లైఫ్ సైన్సెస్ సంస్థకు సాంకేతిక సామర్థ్యం, గతంలో ఆ సంస్థ బాగా పర్ఫార్మ్ చేసి ఉంటే సమస్య ఉండేది కాదు. కనీసం రాజేంద్ర పాకాలకు సైన్స్ రంగంలో ఎలాంటి అనుభం లేదు. దానికి సంబంధించి నైపుణ్యం అతనికి లేదు. ఇతనికి ఉన్న ఏకైక అర్హత కేటీఆర్‌కు బావ మరిది కావడం.’’ కరోనాతో కేటీఆర్ ఫ్యామిలీకి కనక వర్షం కురుస్తోందంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ప్రపంచవ్యాప్తంగా ఇంత ఉపద్రవం తలెత్తినా తెలంగాణ పాలకులు తమ వ్యాపార దృక్ఫథాన్ని వదల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దీని వెనక ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం కేసీఆర్, కేటీఆర్‌పైన ఉంది.
అర్హత లేని కంపెనీలతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల తెలంగాణ బీజేపీ తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెబుతుంది? ప్రజలకు వివరించే బాధ్యత మీపై లేదా బండి సంజయ్ గారూ..’’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.