English | Telugu
వైసిపిలో తాను చేరడం లేదు!
Updated : Mar 10, 2020
ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తే చర్య తీసుకుంటా: రఘువీరారెడ్డి
ఒకప్పుడు రఘువీరారెడ్డి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. రాష్ట్ర మంత్రిగా పని చేశారు. ఏపీకి పీసీసీ చీఫ్ గా పని చేశారు. జాతీయ స్థాయిలోనూ పరిచయాలు, మంచి పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో పొసగలేక గత కొంత కాలంగా మౌనంగా వున్నారు. అయితే వైసిపి పార్టీలో మళ్ళీ రఘువీరారెడ్డి యాక్టివ్ కాబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ వార్తల పట్ల రఘువీరారెడ్డి ఘాటుగా స్పందించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదు సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ అబద్ధం ఇలాంటి న్యూస్ లు పెట్టే వారిపై క్రిమినల్ కేసులు పెడతాం మాజీ మంత్రి ఎన్ రఘువీరా రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తే చర్య తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.
మరో వైపు వైసిపిలో వలసల పర్వం కొనసాగుతూంది. స్థానిక ఎన్నికల్ని సవాలు తీసుకున్న అధికార పార్టీ ప్రతిపక్షాలను ముచ్చమటలు పట్టిస్తోంది. ఇక ఎవరైనా వైసిపిలోకి రావాలనుకునే వారి కోసం జగన్ సర్కార్ ద్వారాలు తెరిచి పెట్టింది. కనిగిరి మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ వైసిపి తీర్థం పుచ్చుకోవడానికి ముహుర్తం ఖరారైంది.
అంతే కాదు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గలో తెలుగుదేశం పార్టీ నాయకులు జెసి బ్రదర్స్ కు షాక్ ఇచ్చారు. జెసి ముఖ్య అనుచరుడైన యాడికి మండలం మాజీ ఎంపీపీ బాల రవి కిషోర్. మాజీ ఉప సర్పంచ్ బాల రమేష్ బాబు వైఎస్ఆర్ సీపీలోకి చేరనున్నారు. అ ధికారికంగా బాల రవి కిషోర్ బాబు రమేష్ బాబు తన అనుచరులతో యాడికి మండల కేంద్రంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో తన అనుచరులతో తాడిపత్రి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ తీర్థం పుచ్చుకోనున్నారు.
కనిగిరి మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ సన్నిహితుడు కదిరి బాబురావు తెలుగుదేశం పార్టీ వీడి వైకాపాలో చేరనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్‌ను కలవడానికి ముహూర్తం ఖరారైంది.