English | Telugu
గల్ఫ్‌లో కరోనా దెబ్బకు ఖైదీల విడుదల!
Updated : Apr 9, 2020
ఒమన్‌లోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 599 మంది ఖైదీలను విడుదల చేస్తూ ఒమన్ సుల్తాన్ షేక్ హైతం బిన్ తారిఖ్ హుకుం జారీ చేశారు. ఇందులో 366 మంది విదేశీ ఖైదీలుండగా.. వారిలో భారతీయులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారట. అయితే తెలుగు వారు ఎంత మంది వున్నారనేది తెలియాల్సి వుంది.
సౌదీ అరేబియా కూడా 250 మంది విదేశీ ఖైదీలను విడుదల చేసింది. మిగిలిన గల్ఫ్ దేశాలు కూడా కరోనా కారణాన ఖైదీలను విడుదల చేస్తున్నాయి. ఇరాన్ 85 వేల మంది ఖైదీలను విడుదల చేసింది.
వీసా నేరాలపై పట్టుబడిన కొంత మంది భారతీయుల్ని దుబాయి, షార్జా పోలీసులు ఉదారంగా వదిలేశారు.