English | Telugu
మరోమారు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ
Updated : Apr 10, 2020
కాగా, ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా, ఇండియాలో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. భారీగా నష్టపోయిన రంగాల్లో విమానయాన రంగం ముందు నిలిచింది. ఈ నేపథ్యంలో విమానంలో మధ్య సీటును ఖాళీగా ఉంచుతూ, బుకింగ్స్ తీసుకుని, విమానాలను నడిపించేందుకు కూడా అనుమతించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
బుధవారం నాడు జరిగిన వివిధ పార్టీల పార్లమెంటరీ నేతల సమావేశంలో, లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని ప్రధాని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. "ప్రతి ఒక్కరినీ కాపాడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దేశంలో పరిస్థితిని దిగజారకుండా చూస్తాం. సోషల్ ఎమర్జెన్సీ అమలులోనే ఉంటుంది. ఇంకొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి. నిఘాను మరింతగా పెంచుతాం" అని మోదీ వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి తరువాత జీవితం ఎన్నడూ ఒకేలా ఉండబోదని, ప్రజల దైనందిన కార్యకలాపాల్లో మార్పు తప్పనిసరని కూడా ఆయన అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా, వేలాది మంది పేద కార్మికులు ఉపాధి కోల్పోయినా, పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి వికాస్ స్వరూప్ వ్యాఖ్యానించారు. ఏదేమైనా, లాక్ డౌన్ ను పొడిగించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ప్రధానిని కోరుతున్నారు. ఒడిశా అయితే, ఏకంగా లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కూడా.