English | Telugu
కరోనాపై పోరుకు 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్! లాక్ డౌన్ 4 మే 18 కంటే ముందే ప్రకటిస్తాం!
Updated : May 12, 2020
వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకుంటూనే ముందుకెళ్లాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. కరోనాతో పోరాటం చేద్దాం. ముందుకు వెళ్దాం. కరోనాతో కలిసి జీవించాల్సిందేనని సైంటిస్టులు, డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పట్టికీ కరోనా మన జీవనంలో భాగమై పోయింది. మాస్క్ ధరించుదాం. సామాజిక దూరాన్ని పాటిద్దాం. ఆత్మస్థైర్యం కలిగిన భారత్ ఆ విధంగా ముందుకెళుతుందని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యం అని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతుల సదుపాయాల కల్పన, వ్యవస్థ, డెమోగ్రపీ అనే నాలుగు పిల్లర్లు, ఐదో పిల్లర్ డిమాండ్ అని మోడీ పేర్కొన్నారు. కరోనా తెచ్చిన ఆపదలను అవకాశాలుగా మలుచుకుంటున్నామని ప్రధాని చెప్పారు. మనవద్ద తయారయ్యే వస్తువు ప్రపంచానికి కూడా ఇవ్వాలనేది మన దృక్పథం. లోకల్ ప్రాడెక్ట్స్ కొనడమే కాదు వాటికి విస్తృత ప్రచారం కల్పించాలని ప్రధాని పిలుపునిచ్చారు.