కరోనా వైరస్ బారిన పడ్డ వారి ప్రాణాలు కాపాడేందుకు చేసే ప్లాస్మా చికిత్సను ఢిల్లీలో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సీఎం కేజ్రీవాల్ ఓ ప్రకటన చేశారు. వాస్తవానికి, ప్లాస్మా చికిత్సను ప్రయోగాత్మకంగా చేయటానికి కేరళ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి తీసుకుంది. అదే పదహతిలో, మూడు నాలుగు రోజుల్లో ప్రయోగాత్మకంగా ప్లాస్మా చికిత్స చేయనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా లభించాయని చెప్పారు. ఈ చికిత్సా విధానం విజయవంతమైతే కనుక తీవ్ర స్థాయిలో ‘కరోనా’ బారిన పడ్డ వారిని కాపాడుకోవచ్చని చెప్పారు.ఢిల్లీలో ఇప్పటి వరకూ కరోనా బారినపడ్డ వారి సంఖ్య 1,578 మంది కాగా, 42 మంది కోలుకున్నారని, 32 మంది మృతి చెందారని అన్నారు. ఈ నెల మొదటి వారంలో కరోనా బారిన పడి ఆసుపత్రులలో చేరిన వ్యక్తులు కోలుకుంటున్నారని, రెండు మూడ్రోజుల్లో డిశ్చార్జి కానున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్పారు.