రెండో విడత పంచాయతీ పోలింగ్ షురూ
3,911 గ్రామాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 12,782 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే.. 38,350 వార్డులకు గాను 108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్నది. దీంతో మిగిలిన 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.