English | Telugu
ఈ.ఎమ్.ఐ.ల చెల్లింపులు జూన్ వరకూ వాయిదా వేయాలి: పవన్ కళ్యాణ్
Updated : Mar 27, 2020
రాష్ట్ర సరిహద్దులు... మార్కెట్లు మూసివేయడంతో మామిడి రైతుల్లో నష్టాల పాలవుతామనే తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. వారిని ఆదుకొనే దిశగా వైసీపీ నేతృత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి ట్విట్టర్ ద్వారా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ స్వయం సహాయక సంఘాల రుణాల చెల్లింపును జూన్ వరకూ వాయిదా వేసి ఆ సంఘాల సభ్యురాళ్ళ వేదనను తగ్గించాలన్నారు. ఈ విపత్కర సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అండగా ఉంటుందని తెలిపారు.