English | Telugu
ఆర్టీసీ సమ్మెకు అండగా నిలిచిన తాత్కాలిక డ్రైవర్ లు...
Updated : Oct 22, 2019
ఈ రోజు ఆర్టీసీ సమ్మె పద్ధెనిమిది వ రోజుకు చేరింది. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్చలకు పిలవలేదు.ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. ఇవాళ కూడా డిపో ముందు కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా డిపో ముందే కూర్చున్నారు కార్మికులు. ఈ రోజు కూడా ఆర్టీసీ కార్మికులు ఉదయం ఐదింటి నుంచే బస్ డిపో ఎదురుగా ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం నుంచే కార్మికులందరూ కూడా రోడ్డుపై బైఠాయించి డిపో ముందు అంటే జెఏసి యొక్క రోజువారి ప్రణాళిక ప్రకారం నిన్న మొత్తం కుటుంబ సభ్యులతో ఆందోళన నిర్వహించిన పరిస్థితి ఉంది. తాత్కాలిక డ్రైవర్ లు, ప్రైవేటు డ్రైవర్ లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా డూటీలో రావద్దని, తమ పొట్ట కొట్టొద్దని చెప్పి వాళ్లని బ్రతిమిలాడిన ఆర్టీసీ జేఏసీ వారిని సమ్మెకు సహకరించాలని వేడుకుంది. రోజువారి కార్యక్రమాల్లో కూడా ఈ రోజు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ రోజు ఆందోళన చేస్తున్న పరిస్థితి అక్కడ నెలకొంది.
ఈ సమ్మెను అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తుంది కాని ఈ ప్రభుత్వం చర్చలకు మాత్రం పిలవటం లేదని, దయచేసి మేము కోరుకునేది ఒకటేనని తమ న్యాయమైన డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులు మొత్తం భర్తిచేయాలని డ్రైవర్, కండక్టర్ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆర్టీసీలో కొన్ని నిధులు బడ్జెట్ లో కేటాయించాలని ఇవే వారి యొక్క ముఖ్యమైన డిమాండ్ లు అని ఆర్టీసీ నాయకుడు తెలియజేశారు. ఇప్పటి వరకు కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరు డిమాండ్లతో మేము చర్చ పెడితే కనీసం ఒక్క డిమాండ్ కూడా వినలేదని, కనీసం చర్చలలో మీతో అవసరం లేదు మాకు మేము వేరే రకంగా బస్సులు తిప్పుకుంటాం, తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ తో బస్సులు తిప్పుకుంటామని అనే వైఖరిలో ప్రభుత్వం ఉందని ఆర్టీసీ జేఏసీ వెల్లడిస్తోంది. భగవంతుడి దయ వల్ల ఈ రోజు తాత్కాలిక డ్రైవర్లు, కండెక్టర్ లు కూడా తమకు సహకరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.ఇక ఇప్పటి దాకా తాత్కాలిక డ్రైవర్లు పై భరోసా ఉన్న ప్రభుత్వం ఇక సమ్మె పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది వేచి చూడాలి.