English | Telugu

ముగిసిన 'షా-జగన్' ల కీలక భేటీ... కొంచెం రాష్ట్రం, కొంచెం రాజకీయం!!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. మొదట ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ముఖ్యమంత్రి ఆ తరువాత పలు అంశాల పై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇంకా రావాల్సిన వాయిదా అంశాలు చాలానే ఉన్నాయి. వాటన్నింటిని ఒకసారి హోంమంత్రికి గుర్తు చేశారు. ఎందుకంటే హోంశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంది విభజన చట్టాన్ని అమలు చేయడానికి. కాబట్టి హోంశాఖ ద్వారా అమలు చేయాల్సినవి వాటికి సంబంధించిన పురోగతి ఎన్ని అమలయ్యాయి. అమలవుతున్న వాటి పరిస్థితి ఏంటి, ఇంకా పెండింగ్ లో ఉన్న అంశాలేంటి, వీటన్నిటి గురించి కూడా చర్చించినట్టు సమాచారం.

దీంతో పాటు పొలిటికల్ సమస్యల విషయానికి వచ్చేసరికి పోలవరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర బిజెపి నేతలు వ్యవహరిస్తున్న తీరు, గతంలో అదే ప్రాజెక్టు గురించి రాష్ట్ర బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు వీటన్నింటిని కూడా ఆయన హోంమంత్రి దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిసింది. ఎందుకంటే గతంలో ఈ పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు రివర్స్ టెండర్ల వ్యవహారాన్ని ఎందుకు తప్పుపడుతున్నారు. ఆ పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్ల ద్వారా ప్రభుత్వానికి ఆదా అయ్యే పనే చేస్తున్నప్పటికీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం తప్పుబడుతూ దాన్ని రాద్ధాంతం చేస్తున్న వైనం, ఈ విషయం గురించి కూడా మాట్లాడారని సమాచారం అందింది. ఇక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ పిపిఎ విషయంలో చోటు చేసుకున్న వివాదం ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఏంటి అని వీటికి సంబంధించి కూడా అని కొంత వివరణ ఇచ్చినట్టుగా మనకు సమాచారమందుతోంది.ఇక వీరీ భేటీకి జగన్ సర్కార్ కు ఏమైనా ఉపశమనాన్ని ఇవ్వబోతోందో లేదో వేచి చూడాలి.