English | Telugu

ఎట్టకేలకు 'ఆపరేషన్ రాయల్ వశిష్టా' సక్సెస్

గోదావరిలో టైటానిక్ గా ముగుస్తుందేమో అనుకున్న రాయల్ వశిష్టా బోటు ఒడ్డూకు చేరుతోంది.గడచిన ముప్పై ఏడు రోజులుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్నటువంటి రాయల వశిష్ట బోటు కొద్ది సేపటి క్రితమే గోదావరి నదిలో పైకి తేలింది. గత వారం రోజులుగా రాయల్ వశిష్ట ఆపరేషన్ బోట్ కి సంబంధించి ఆపరేషన్ టూ జరుగుతుంది. వారం రోజుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో కృషి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపు సత్యం బృందం, రెండో వైపున డీప్ వాటర్ డైవర్స్ ఇద్దరూ కూడా సంయుక్తంగా ఒక అవగాహన తోటి పూర్తిస్థాయిలో బోటు గోదావరిలో ఎక్కడుందని ఒక అంచనా వేసుకుంటూ దానికి సంబంధించి ఐరన్ రోప్ ని కట్టి, లంగర్లను కట్టి లాగే ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు కొంత నిరాశ ఏర్పడినప్పటికి కూడా నిన్న కొంత ఆశావాహంగా కనిపించింది.

డీప్ వాటర్ డైవర్స్ లోపలకు వెళ్లి ఒక బలమైన వస్తువుకు ఐరన్ రోప్ లు కట్టారు. ఆ కట్టిన సందర్భంలోనే బోటుకు సంబంధించినటువంటి ముందు భాగం బయటకొచ్చింది. బయటకొచ్చె పరిస్థితిలో కట్టిన రోప్ లు ఊడిపోతున్నా మళ్లీ మళ్లీ ఐరన్ రోప్ లను కట్టారు.చివరకు బోట్ కు వెనకవైపున ఉన్నటువంటి సాఫ్ట్ భాగంలో బలంగా కూడా ఐరన్ రోప్ ని కట్టారు. ఈ రోజు ఉదయం మళ్లీ ఇక్కడికి వచ్చి ముందు భాగం లో రెండు రోప్ లు కట్టారు. అయితే అది మధ్యాహ్నం వరకు పన్నెండు గంటల సమయంలో అవి ఊడిపోయినప్పటికి, బలంగా సాఫ్ట్ భాగానికి కట్టిన రోప్, ఈ బోట్ వెనక భాగానికి ఆ ఐరన్ రోప్ బలంగా దాన్ని పట్టుకుని ఉండటం తోటి క్రమక్రమంగా గోదావరి నదిలోని బోటు ఒడ్డుకొస్తుంది. దీనితో అందరిలోనూ సంతోషం కనిపిస్తుంది. నిన్నటి వరకు ఒక ఉత్కంఠ, నిరాశకు లోనైనప్పటికి కూడా ఈరోజున ఏ పని చేశారో దానికి తగిన ప్రతిఫలం కనిపిస్తోందని ఆనందం అందరిలోనూ ఉంది. అదే విధంగా ఇంకా పన్నెండు మందికి సంబంధించి గల్లంతైనవారికి సంబంధించినటువంటి జాడ తెలియాల్సిన నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి బంధువులంతా కూడా ఆ ప్రాంతంలో ఎదురుచూస్తున్న నేపధ్యంలో బోటు బయటకు రావడం వారి మనసుల్లోని నిరీక్షణకు ఫలితంగా కనిపిస్తోంది.