English | Telugu

సహాజీవన్ రెడ్డి గారికి నిబంధనలు వర్తించవా?

భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకి కేసులు పెరుగుతుండటంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు మాస్కులు పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచిస్తున్నాయి. అయితే ఏపీలో మాత్రం సాక్షాత్తూ ముఖ్యమంత్రే నిబంధనలకు గాలికి వదిలేయడంపై టీడీపీ నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన లోకేష్.. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.

"వైఎస్ జగన్ గారి పాలనలో సామాన్యులకు మాత్రమే రూల్స్ వర్తిస్తాయా? ప్రజలంతా ఖచ్చితంగా మాస్కు పెట్టుకోవాలి లేకపోతే చర్యలు తప్పవు అంటూ జిఓ తెచ్చిన వారు ఆ నిబంధన పాటించరా? యుశ్రారైకాపా నాయకులు కరోనా కి అతీతులా?" అని లోకేష్ ప్రశ్నించారు.

"సహాజీవన్ రెడ్డి గారికి నిబంధనలు వర్తించవా? మాస్కు పెట్టుకోకుండా స్వైర విహారం చేస్తున్న జగన్ రెడ్డి గారు ప్రజలకు ఎం సమాధానం చెబుతారు?" అని లోకేష్ నిలదీశారు.