English | Telugu
అప్పుడు 'కావాలి జగన్, రావాలి జగన్'.. ఇప్పుడు 'కావాలి ఇసుక, రావాలి కరెంటు'
Updated : Oct 1, 2019
ఏపీలో కరెంట్ కోతలపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. "రివర్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారూ, పవర్లోకి వచ్చిన మీరు సరికొత్త పాలన అంటుంటే ఏంటో అనుకున్నాం. 4 నెలల్లోనే పవర్ కట్ లతో కొవ్వొత్తులు, విసనకర్రల కాలానికి తీసుకెళ్లి అందరికీ అన్నింటా 'కోత' పాలన చూపిస్తున్నారు. తెదేపా హయాంలో కరెంటుపోతే విచిత్రం.. మీ జమానాలో కరెంటు ఉంటే అదృష్టం." అని లోకేష్ ఎద్దేవా చేసారు.
"ఆంధ్రప్రదేశ్ ని అంధకారప్రదేశ్ గా మార్చిన ఘనత మీ సొంతం. విద్యుత్ కోతలు అలా పల్లెల నుంచి పట్టణాల వరకూ పెంచుకుంటూ పోతున్నారు. అధికారం మత్తు, అనుచరుల భజనల మధ్య మీకు వినిపించడంలేదు కానీ, కావాలి ఇసుక, రావాలి కరెంటు అంటూ జనం హై పిచ్ లో పాడుతున్నారు." అంటూ మరో ట్వీట్లో సెటైర్లు వేశారు.