English | Telugu
నానక్ రామ్ గూడలో అమెరికా కాన్సులేట్
Updated : Mar 10, 2020
హైదరాబాద్‌లో నిర్మాణం అవుతున్న నూతన అమెరికన్ కాన్సుల్ జనరల్ కార్యాలయం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాక ఇతర రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉండబోతోంది. వచ్చే ఏడాది నుంచి నూతన భవనం అందుబాటులోకి వస్తుంది. నానక్ రాం గూడలో నిర్మిస్తున్నఅమెరికా నూతన కాన్సుల్ జనరల్ కార్యాలయానికి సంబంధించిన టాపింగ్ ఔట్ కార్యక్రమంలో జరిగింది. వచ్చే సంవత్సరం నుంచి మొత్తం కార్యక్రమాలు నానక్‌రాం గుడ నుంచి జరుగుతాయి. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింభిస్తూ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి.
అమెరికా అంబాసిడర్ కెన్నత్ ఐ జస్టర్‌తో కలిసి మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కాన్సుల్ జనరల్ కార్యాలయం హైదరాబాద్ నగర సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. దక్కను పీఠభూమి నిర్మాణ శైలిని, హైదరాబాద్ సహజత్వానికి దగ్గరగా కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని అమెరికా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
అమెరికా తెలంగాణ మధ్య స్నేహపూర్వక బంధం ఉందని, భవిష్యత్తులో ఇది మరింత బలోపేతమవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికా, భారత్ మధ్య సత్సంబంధాలు కలిగి ఉండటం ప్రపంచానికి మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇక్కడికి భారీ కాన్సుల్ జనరల్ కార్యాలయం రావడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అన్నారు. పరిశ్రమల ఏర్పా టుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ ఐపాస్ బాగుందని అమెరికా అంబాసిడర్ కెన్నత్ ఐ జస్టర్ కొనియాడారు.
హైదరాబాద్ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి నగరంలో భారీ కాన్సుల్ జనరల్ కార్యాలయం రావడం ఇక్కడి పౌరులకే గాక ఇతర రాష్ట్రాల పౌరులకు కూడా సౌకర్యంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో అమెరికా మరియు తెలంగాణల మధ్య మరింత దృఢమైన బంధం ఏర్పడుతుందన్న విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.
రెండు దేశాల మధ్య స్సంబంధాల కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత దేశ ప్రధాని మోడీ ఈ దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. తాజాగా ఇండియాలో పర్యటన విజయవంతానికి భారత్లో అమెరికా రాయబారి కెన్నెత్ జేస్టర్ కృషి చేశారన్నారు.