English | Telugu
అంపశయ్య మీద 10 జన్ పథ్
Updated : Mar 10, 2020
అంపశయ్య మీద భారత జాతీయ కాంగ్రెస్. అవునా, ఇది నిజమేనా? ఈ దేశానికి స్వతంత్రం తీసుకువచ్చిన మహా నాయకులు నడిపించిన పార్టీ ఈ రోజు వయసు మీద పడి మెలమెల్లగా తన పూర్వ ప్రాభవాన్ని కోల్పోతోందా? ఒక్క సరి చరిత్రలోకి వెళితే.... 1960 దశకంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర సంక్షోభం. కామరాజ్, నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్ వంటివారు ఒకవైపు. ఇందిరా, జగ్ జీవన్, వై బి చవాన్, సి సుబ్రహ్మణ్యం వంటివారు మరో వైపు. పార్టీ రెండుగా చీలింది. దశాబ్ద కాలంలో పరిస్థితులు మారాయి. తర్వాత ఇందిరా గాంధీ ప్రాబల్యం పెరగడంతో మళ్ళీ ఇందిరను నాయకురాలిగా అంగీకరించారు.
1990 దశకంలో కాంగ్రెస్ పార్టీలో మరోసారి సంక్షోభం. సీనియర్ నేతలు తివారి నేతృత్వంలో పార్టీలో చీలిక. సోనియా నాయకత్వానికి సవాల్. శరద్ పవార్, మమతా బెనర్జీ వంటివారు సోనియా నాయకత్వాన్ని వ్యతిరేకించారు. దశాబ్ద కాలంలో పరిస్థితులు మారాయి. నాయకులు సోనియాగాంధీ నాయకత్వాన్ని అంగీకరించలేదు కానీ బయటనుండి బలపర్చారు. విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2020 దశకంలో కాంగ్రెస్ పార్టీలో మరో సంక్షోభం. వయస్సు రీత్యా నాయకత్వం నుండి తప్పుకున్న సోనియా. పార్టీని నడిపించలేక తప్పుకున్న రాహుల్. వృద్ధ జంబూకల మధ్య నిలువలేక వెళ్లిపోతున్న యువతరం.
సమర్ధవంతమైన నేత లేక చేతులెత్తేస్తున్న నాయకత్వం. మరి 2040 దశకం...ఎలా ఉంటుంది ? ఇది ప్రస్తుతం పార్టీ ని కుదిపేస్తున్న ప్రశ్న. జ్యోతిరాదిత్య లాంటి లాయలిస్టుల నిష్క్రమణ తో, మధ్య భారతం లో శూన్యాన్ని కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా ఆహ్వానించింది. కాంగ్రెస్ కి ప్రాణం పోసిన ఆ నలుగురు నాయకుల కొడుకులే ఆ పార్టీ కి సమాధి కడుతున్నారు. ఏ నలుగురు నాయకులు అయితే కాంగ్రెస్ కి ప్రాణం పోశారో వారి మరణం విషాదం ... వారి కొడుకులకు అవమానం ---- వారి కొడుకులు ఇప్పటికి ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. మూడో నాయకుడు అయ్యే దారిలో ఉన్నాడు. నాలుగో నాయకుడు కూడా నిజం తెలుసుకుంటాడు.
రాజేష్ పైలట్ 2000 లో తీవ్రమైన రోడ్డు ప్రమాదo లో మరణం మాధవరావు సింధియా 2001 లో హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తుండగా మరణం .... వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 లో హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తుండగా మరణం దూర్జీ ఖండూ 2011 లో హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తుండగా మరణం ....వీరి మరణం తర్వాత వీరి కుమారులకు తీవ్రమైన అవమానాలు జరిగాయి. పార్టీ వదిలి వెళ్లే వరకు వేధించారు ... వేధిస్తున్నారు... వెళ్లినా వేధిస్తున్నారు.... ఇప్పటికి ఫెమా ఖండూ, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడే జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య మంత్రి అవుతాడు అనే నమ్మకం వచ్చింది. కాదు కాదు.... జోతిరాధిత్య ను పదే పదే అవమానాలకు గురి చేయటం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఆ అవకాశాన్ని కల్పించింది. ఇక సచిన్ పైలెట్ కూడా కాంగ్రెస్ బయటకి వస్తే కాంగ్రెస్ కి సమాధి ఖాయం అనే అభిప్రాయం బలంగా కనిపిస్తోంది. ప్రజలు మెచ్చే నాయకులకి పదవులు ఇవ్వాలి ... 10 జనపథ్ నుండి వచ్చే వారికి కాదనే డిమాండ్ పార్టీ లో బలంగా వినిపిస్తోంది.