English | Telugu

ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా

తెలంగాణ క్యాబినేట్‌లో మంత్రి పదవి ఆశిస్తున్న ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా పదవులను సీఎం రేవంత్‌రెడ్డికి కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. రామకృష్ణరావు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారు (గవర్నమెంట్ అడ్వైజర్)గా నియమించారు.

మంచిర్యాల ఎమ్మెల్యే కె. ప్రేమ్‌సాగర్ రావుకు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ (సివిల్ సప్లైస్ కార్పొరేషన్) చైర్మన్‌గా నియమించారు.. గత కొన్ని రోజులుగా ఇద్దరు సీనియర్ నేతలు మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వారిని సంతృప్తిపరిచేందుకే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వారి అనుభవాన్ని ప్రభుత్వానికి ఉపయోగించుకోవడంతో పాటు, పార్టీలో వారికి సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. పి. సుదర్శన్ రెడ్డికి క్యాబినేట్ హోదా కల్పించారు. ఆయనకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించారు. ఆరు గ్యారంటీల అమలు బాధ్యత ఆయనకు అప్పగించారు. ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రభుత్వ సలహాదారులు ఉండగా ఎవరికీ కేబినెట్ హోదా లేదని సుదర్శన్ రెడ్డిని ఒప్పించి క్యాబినేట్ హోదాలో సలహాదారుగా నియమించారు