English | Telugu
బీఆర్ఎస్ అభ్యర్థిపై కేసు నమోదు...ఎందుకంటే?
Updated : Oct 31, 2025
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ కారు గుర్తు ఉండే ఓటర్ స్లిప్‌లను ఆ పార్టీ శ్రేణులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయి రామ్‌కు ఫిర్యాదు చేశారు.
సునీతపై వచ్చిన ఆధారాలను గుర్తించిన రిటర్నింగ్ అధికారి బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. మరోవైపు జూబ్లీ ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతుంది. నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. 14వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో అత్యధికంగా 58 మంది అభ్యర్థులు తుది జాబితాలో ఉన్నారు.