English | Telugu
కేబినెట్ భేటీ ముగిసింది.. అయినా వీడని సస్పెన్స్!!
Updated : Dec 27, 2019
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో రాజధానికి సంబంధించి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక గురించి, అలాగే స్థానిక ఎన్నికల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. మూడు రాజధానులపై నిర్ణయం అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ప్రకటించాలని అనుకున్నట్లు సమాచారం. వీటితో పాటు రాజధాని రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్స్ అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కన్నబాబు.. రాజధానిపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు. రిపోర్ట్ వచ్చాక ఏం చేయాలన్న అంశంపై ఆలోచిస్తామని తెలిపారు. కాగా.. రాజధానిపై వచ్చే నెల 3న బీసీజీ నివేదిక ఉంటుందని సమాచారం. నివేదికపై అధ్యయనం చేసిన తర్వాతే రాజధానిపై ఫైనల్‌గా ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని తెలుస్తోంది. జీఎన్ రావు, బీసీజీ నివేదికలు పరిశీలించిన అనంతరమే ప్రకటన ఉంటుందని సమాచారం.