English | Telugu

మంత్రి అజారుద్దీన్ శాఖలివే!

ఇటీవలే రేవంత్ కేబిరెట్ లో బెర్త్ లభించిన మహ్మద్ అజారుద్దీన్ కు మైనారిటీ, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలు దక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ప్రభుత్వ రంగ సంస్థలు, మైనారిటీ శాఖలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలి నుంచీ అజారుద్దీన్ కు హోంశాఖ కేటాయిస్తారంటూ ప్రచారం జరిగింది.

ఎందుకంటే ఆ శాఖ ముఖ్యమంత్రి అధీనంలో ఉండటమే. దీంతో కొంత మేర ఒత్తిడి తొలగించుకునేందుకు ముఖ్యమంత్రి హోంశాఖను అజారుద్దీన్ కు కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణుల నుంచీ, ప్రభుత్వ వర్గాల నుంచీ ప్రచారం జరిగింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖను తన వద్దే అట్టేపెట్టుకున్నారు. అజారుద్దీన్ కు ప్రభుత్వ రంగ సంస్థలు, మైనారిటీ శాఖలు అప్పగించారు.