English | Telugu
కేవలం పదహారు నిమిషాల్లోనే జేబీఎస్ టు ఎంజీబీఎస్...
Updated : Feb 7, 2020
భాగ్యనగర వాసుల కల సంపూర్ణమైంది, హైదరాబాదుకు మణిహారంగా మారిన మెట్రో రైలు ప్రాజెక్టులో మరో కీలక మార్గం అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు మార్గాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మెట్రో ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ప్రయాణించారు, ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాసయాదవ్, మల్లారెడ్డి, ప్రభుత్వ మెట్రో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకు మొత్తం పదకొండు కిలోమీటర్ల మార్గంలో తొమ్మిది మెట్రో స్టేషన్ లు ఉన్నాయి. కేవలం పదహారు నిమిషాల్లోనే వారంతా గమ్యానికి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ కు అన్ని మెట్రో స్టేషన్ ల దగ్గర స్వాగతం పలుకుతూ అభివాదం చేశారు. తొలిదశ మెట్రో ప్రాజెక్టులో ఇది చివరి దశ కావడంతో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. దీంతో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రోగా ఘనత సాధించిందిహైదరాబాద్ మెట్రో.
మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో ప్రతిపాదించిన నలభై రెండు కిలోమీటర్ల మార్గంలో అరవై తొమ్మిది కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో కారిడార్ గా నిలిచింది, ఇది ఇంజినీరింగ్ అద్భుతమనే చెప్పాలి. ఎంజీబీఎస్ స్టేషన్ నిర్మాణం పలు ప్రత్యేకతలతో నియమించారు, యాభై ఎనిమిది పిల్లర్ లు, ఆరు గ్రిడ్స్ తో పూర్తి స్థాయి స్టీల్, నాణ్యమైన సిమెంట్ కాంక్రీట్ తో స్టేషన్ ను నిర్మించారు. ఎల్ బి నగర్ నుంచి మియాపూర్ మార్గంలో ప్రయాణించి కారిడార్-1 కు సంబంధించిన రైళ్ల రాకపోకలు ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ కింది అంతస్తుల ద్వారా ప్రయాణం సాగుతుంది. జేబీఎస్ నుంచి ఫలక్ నుమా మార్గంలో సాగించే రైలు పై అంతస్తుల ద్వారా రాకపోకలు సాగిస్తాయి. అయితే ఒక మార్గం నుంచి మరో మార్గం మారటానికి సులభమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాబోయే వంద సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా నిర్మించారు. రిటైల్ అవుట్ లెట్లు, ఎంటర్టైన్మెంట్ జోన్ లు, కన్వేయన్స్ ఔట్ లెట్ లను కాంకర్స్ లెవల్ లో నిర్మించారు.