English | Telugu

తిరుపతిలో చికెన్, మటన్ దుకాణాలు బంద్!

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోకరోనా వైరస్ లాక్ డౌన్ అమల్లో ఉంది మరియు రెడ్ జోన్లు నమోదు కావడం, నగరంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండుటకు ఆదివారం నాడు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో చికెను, చేపలు, మటను దుకాణాలు తెరువరాదని నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

లాక్ డౌన్ ముగిసేవరకు ప్రతి ఆదివారం తిరుప‌తి నగరంలో చేపలు, చికెన్ మరియు మటన్ దుకాణాలు తెరవకూడదు. ఈ చర్య ప్రజాఆరోగ్యమును దృష్టిలో వుంచుకొని తీసుకున్న ముందు జాగ్రత్త చర్య అట్లు సూచనలు పాటించక దుకాణములు తెరిచిన యెడల చట్ట పరమైన చర్యలు తీసుకోబడును. ఈ నిబంధనలు ఉల్లంఘించిన యెడల దుకాణం సీజ్ చేసి, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామ‌ని మున్సిప‌ల్ క‌మీష‌న్ హెచ్చ‌రిస్తూ ఆదేశాలు ఇచ్చారు. తిరుప‌తి నగరపాలక సంస్థ పరిధిలో చికెన్, మటన్ దుకాణాలు తెరిచినచో కాల్ సెంటర్ 0877-2256766 కి స‌మాచారం ఇవ్వాల‌ని క‌మీష‌న‌ర్ కోరారు.