English | Telugu
పిచ్చి చైనా.. తాను తీసుకున్న గోతిలో తానే పడింది
Updated : May 12, 2020
మనం ఓ పది వస్తువులు కొంటే వాటిల్లో దాదాపు ఏడెనిమిది వస్తువులపై 'మేడ్ ఇన్ చైనా' అని రాసి ఉంటుంది. దీనినిబట్టే ప్రపంచ మార్కెట్ పై చైనా వస్తువుల ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. పిన్నీస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ దాకా క్వాలిటీతో సంబంధం లేకుండా దాదాపు అన్ని ఐటమ్స్ తయారుచేసి ప్రపంచ దేశాల మీదకు వదులుతుంటుంది చైనా. కాస్ట్ కూడా అందుబాటులో ఉండటంతో ప్రజలు కూడా తెలిసో తెలియకో చైనా వస్తువులు కొంటుంటారు. దీంతో ఇన్నాళ్లు చైనా ఆటలు సాగాయి. అయితే ఇప్పుడు కరోనా గేమ్ లో చైనా కూడా బలైంది.
కరోనా దెబ్బకి నిత్యవసరాలు తప్ప అనవసర వస్తువులు కొనాలన్నా ఆలోచన ప్రజల్లో లేదు. ఒకవేళ కొనాలన్నా డబ్బులు కూడా లేవు. దీనికితోడు ఇప్పుడు దేశాలు కూడా వస్తువులు ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితిలో లేవు. ఇక చైనా నుంచైనా అసలు ఛాన్సే లేదు. అందుకే చైనాలో చాలా కంపెనీలు తాత్కాలికంగా మూతపడ్డాయి. ముఖ్యంగా గార్మెంట్స్, టాయ్స్ కంపెనీలు మూతపడ్డాయి. తయారుచేసినా కొనేవారు లేరు, వర్కర్స్ కి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. దీంతో పలు కంపెనీలు తాత్కాలికంగా మూతపడ్డాయి. ప్రపంచ మార్కెట్ ని శాసించిన చైనాలోని కంపెనీలే మూతపడే పరిస్థితికి చేరుకున్నాయంటే, ఇలాంటి సమయంలో మన దేశం తీసుకునే ప్రతి నిర్ణయం, వేసే ప్రతి అడుగు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.