English | Telugu

రోడ్ పై బైక్ రేసింగ్ ను ప్రశ్నించిన వ్యక్తికి 28 కత్తిపోట్లు.. చోద్యం చూసిన జనం

ఇండియా జనాభా లో యువతరం 34 శాతం. దీంతో ప్రపంచం లోని మల్టి నేషనల్ కంపెనీలన్నీ అటు మ్యాన్ పవర్ కోసం ఇటు తమ బిజినెస్ డెవలప్ చేసుకోవడం కోసం ఇండియాను టార్గెట్ చేస్తున్నాయి. ఐతే కొంత మంది యూత్ మాత్రం బిజీగా ఉండే రోడ్ల పైనే కార్ రేసులు, బైక్ రేసులు అంటూ రోడ్ల పైన పడి అలజడి సృష్టిస్తూ.. అదేమని ప్రశ్నించే వారి పై తీవ్రంగా దాడులు చేస్తున్నారు.

తాజాగా ఇటువంటి సంఘటన ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని నిత్యం రద్దీగా ఉండే రఘుబీర్ నగర్ లో 17 ఏళ్ల లోపు టీనేజర్లు ముగ్గురు బైక్ రేసింగ్ స్టంట్ లు చేస్తుండటంతో స్థానికులకు ఇబ్బంది కలుగుతోందని 25 ఏళ్ల మనీష్ అనే కార్ డ్రైవర్ వారిని వారించాడు. దీంతో ఆ ముగ్గురు టీనేజర్లు ఈ నెల 8 న మనీష్ పై పట్టపగలు నడి రోడ్ పై చాకుల వంటి మారణాయుధాలతో దాడి చేసి 28 సార్లు ఛాతీలోనూ గొంతు వద్ద పొడవడం తో అతను తీవ్రంగా గాయ పడ్డాడు. ఐతే చుట్టు పక్కలవారు కానీ అటుగా వెళుతున్న వారు కానీ ఎవరు వారిని వారించలేదు. దీంతో హాస్పిటల్ లో అడ్మిట్ చేసే సమయానికే మనీష్ ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ఈ సంఘటన సమీపంలోని సిసి కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఘటన పై కంప్లైంట్ అందుకున్న పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా ఆ టీనేజర్లను అరెస్ట్ చేసారు. ఐతే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఇటువంటి ఘటనలు జరుగుతున్నపుడు ఆ చుట్టు పక్కల ఉన్నవారు కూడా స్పందించకపోవడం పై మరో సారి తీవ్ర చర్చ జరుగుతోంది.