English | Telugu

ఖైదీలకు మేలు చేసిన కరోనా

ఇందు కాదు అందు కాదు ఎందెందు చూసినా అందందు కలదు.. అన్న విధంగా కరోనా ప్రపంచంలోని అన్ని మూలలకు వ్యాపిస్తోంది. జనసామర్ద్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే కాదు జైళ్లలోనూ సోకింది.

దాంతో ఖైదీలను విడుదల చేయాలన్న ఆలోచనలో చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇది మనదేశంలో కాదు.. కాలిఫోర్నియాలో. అక్కడ జైలులో శిక్ష అనుభవిస్తున్నవారిలో దాదాపు 8,000 మంది ఖైదీలను ఆగస్టు చివరి నాటికి విడుదల చేస్తున్నామని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. కోవిద్ 19 వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని జైలు అధికారులు చెప్తున్నారు.

కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ ది కరెక్షన్స్ అండ్ రిహాబిలిటేషన్ నివేదిక ప్రకారం రాష్ట్ర జైళ్లలో ఉన్న ఖైదీల్లో 2,286 మందిలో కరోనా పాజిటివ్‌ లక్షణాలున్నాయి. వారిలో కొంత మంది చనిపోయారు. దీంతో తక్కువ శిక్ష అనుభవిస్తున్నవారిని ఈ నెలాఖరులోగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా కారణంగా వేలాది మంది ఖైదీలు ఇంటిదారి పట్టనున్నారు. మనదేశంలోనూ అనేక జైళ్లలో ఇదే పరిస్థితి. ఇక్కడి ప్రభుత్వాలు కూడా ఖైదీల విషయం పరిశీలించాలని పౌరసంఘాలు కోరుతున్నాయి.