English | Telugu

తొర్రూరులో జాతీయ జెండాకు ఘోర అవమానం

మహబూబాబాద్ జిల్లాలో జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగిందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో 79వ స్వాతంత్ర దినో త్సవం రోజే జాతీయ జెండాకు అవమానం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఈరోజు ఆగస్టు 15వ తేదీ సంద ర్భంగా 100 అడుగుల జెండాను వైస్ ప్రెసిడెంట్ అనుమండ్ల ఝాన్సీ రెడ్డి ఈరోజు ఉదయం ఆవిష్కరించారు. అందరూ ఆకాశంలో ఎగురుతున్న జెండాను చూస్తూ సెల్యూట్ చేస్తున్న సమయంలో జెండా చినిగిపోయి ఉండడం చూసి ఒక్క సారిగా అవాక్క య్యారు. చినిగిన జాతీయ జెండా ఎగరవే యడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు...

ప్రతి సంవత్సరం ఈ ప్రభుత్వ పాఠశాల లో జెండా ఆవిష్క రణకు రిటైర్ ఆర్మీ అధికారులు మరియు దేశ సేవ చేసిన ప్రముఖు లను ఆహ్వానించి వారి చేత జెండా ఆవిష్కరణ చేసేవారు... కానీ ఈసారి ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ తో జెండా ఎగర వేయించారు.అయితే చినిగిన జాతీయ జెండా ఎగరవే యడం, దేశ గౌరవా నికి అవమానకర మంటూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.