English | Telugu

బీఆర్ఎస్ అభ్యర్థి సునీత నామినేషన్ రద్దు చేయండి : ప్రద్యుమ్న

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న సంచలన ఆరోపణలు చేశారు. తన తల్లి మాలనీదేవికి మాగంటి గోపినాథ్ విడాకులు ఇవ్వలేదని ప్రద్యుమ్న ఈసీకి ఫిర్యాదు చేశాడు. గోపీనాథ్, సునీత కేవలం లివ్ ఇన్ రిలేషన్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు. ఆమె సునీత నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. మాగంటి గోపీనాథ్‌కు చట్టబద్ధమైన ఏకైక వారసుడిని నేనే అని చెప్పారు.

పెళ్లి చేసుకోకుండా అఫిడవిట్‌లో తన భర్త అంటూ గోపీనాథ్ పేరును సునీత ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. నిజాలను దాచి సునీత ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను పొందారని ఆయన ఆరోపించారు. నిజాలను దాచి సునీత ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను పొందారని పేర్కొన్నారు. సునీతకు ఇచ్చిన ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను అక్టోబర్ 11న ఆర్డీవో రద్దు చేశారని తారక్ ప్రద్యుమ్న డిమాండ్ చేశారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ నేత, రెండో సెట్ నామినేషన్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.