English | Telugu
జూబ్లీ బైపోల్.. 130 మంది నామినేషన్లు రిజెక్ట్.. బరిలో మిగిలింది 81 మంది!
Updated : Oct 23, 2025
జూబ్లీ బైపోల్ బరిలో 81 మంది మిగిలారు. ఈ ఉప ఎన్నికలో పోటీకి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. కాగా బుధవారం (అక్టోబర్ 22) నామినేషన్ల స్క్రూటినీ జరిగింది. 211 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 321 నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ దాదాపు 17 గంటల పాటు సాగింది. వివిధ కారణాలతో 130 మంది నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
సరైన ఫార్మాట్‌లో పత్రాలు సమర్పించకపోవడం, వివరాలు అసంపూర్తిగా ఉండటం వంటి కారణాలతో 130 మంది అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో స్క్రూటినీ అనంతరం జూబ్లీ బరిలో 81 మంది మిగిలారు. ఇక నామినేషన్ల ఉప సంహరణకు ఇంకా ఒక రోజు గడువు ఉండటంతో బరిలో మిగిలిన వారిలో ఎందరు తమ నామినేషన్లను ఉపసంహరిం చుకుం టారన్నది చూడాల్సి ఉంది. ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు విడుదల కానున్నాయి.