English | Telugu

తెలంగాణలో ఈ నెల 30 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింపు!

తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగించ‌డానికి తెలంగాణా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 30 త‌రువాత ప‌రిస్థితిని బ‌ట్టి ద‌శ‌ల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. లాక్‌డౌన్‌ను ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. క‌రోనా కార‌ణంగా తెలంగాణాలో ఇప్ప‌ట్టి వ‌ర‌కు 14 మంది చ‌నిపోయారు. మొత్తం 503 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. అందులో 96 మంది పూర్తిగా కోలుకుని ఇళ్ల‌కు వెళ్ళారు. 393 మంది చికిత్స పొందుతున్నారని ముఖ్య‌మంత్రి తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ప్రగతిభవన్‌లో శనివారం మధ్యాహ్నం 3గంటల నుంచి ఐదు గం టలకుపైగా జరిగింది. లాక్‌డౌన్ పొడిగింపు అంశంతోపాటు ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించిన‌ట్లు సి.ఎం. చెప్పారు. ఇతర దేశాలనుంచి వచ్చిన 34 మందితోపాటు 25937 మంది క్వారంటైన్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని సి.ఎం. తెలిపారు.

మర్కజ్‌కు వెళ్లిన వచ్చిన సుమారు 1200మందిని గుర్తించి, క్వారంటైన్ చేశామని 1640మంది ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. కంటైన్మెంట్ జోన్లు 243 ఉన్నాయని, ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 123, ఇతర ప్రాంతాల్లో 120 ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్ 24వ తేదీ వరకు అందరూ కోలుకుంటారని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు ప్రజలందరూ కూడా సహకరించాలని ఆయన కోరారు.

ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి తొమ్మిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు పైక్లాస్‌కు ప్ర‌మోట్ చేస్తున్నాం. అయితే ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌పై త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సి.ఎం. తెలిపారు. క్యాబినెట్ నిర్ణ‌యాల‌ను ప్ర‌ధాన‌మంత్రికి పంపిస్తున్నాం.